త్రిష పెళ్లి ఎక్కడ చేసుకుంటుందో తెలుసా..?

అప్పుడెప్పుడు 2003 లో నీ మనసు నాకు తెలుసు చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన త్రిష..ఇప్పటికి తన సత్తా చాటుతూ వస్తుంది. తెలుగు , తమిళ్ భాషల్లో సీనియర్ , యంగ్ హీరోల సరసన నటిస్తూ ప్రేక్షకులను ,ఆ బిమానులను అలరిస్తూ వస్తుంది. 2018 లో తమిళంలో నటించిన 96 మూవీ త్రిష ను మళ్లీ బిజీ చేసింది.

తాజాగా ఈ భామ తన పెళ్లి వేదిక గురించి చెప్పుకొచ్చింది. నా పెళ్లి గురించి ఎప్పటికప్పుడు మీడియాలో వార్తలు వస్తూనే ఉంటాయి. నాకు తెలియకుండానే పెళ్లి గురించి, డేటింగ్ గురించి ప్రచారం జరిగిపోతూ ఉంటుంది. నేను ప్రేమ వివాహమే చేసుకుంటా. నాకు లాస్ వేగాస్ అంటే ఇష్టం. అక్కడే పెళ్లి చేసుకుంటాన`ని త్రిష చెప్పింది.