బండి సంజయ్ పై ఫిర్యాదు

‘ఎంఐఎంతో కుమ్మక్కైనందున సీఎం కేసీఆర్ కు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే అనుమానాలు కలుగుతున్నాయి. నిఘా సంస్థలు కేసీఆర్ కదలికలను డేగకళ్ళతో కనిపెడుతుండాలి’ అని తెలంగాణ భాజాపా అధ్యక్షుడు బండి సంజయ్ ట్విట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తెరాస నేతలు భగ్గుమంటున్నారు.

తాజాగా బండి సంజయ్ పై టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. సంజయ్‌పై ప్రజా ప్రాతినిధ్యం చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భరత్‌ కుమార్‌ ఎస్‌ఈసీ కమిషనర్‌ పార్ధసారిథిని కలిశారు. ఈ సందర్భంగా సీఎంపై అదేవిధంగా నగరంలో మత సామరస్యానికి భంగం కలిగేలా బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలను పేర్కొంటూ విజ్ఞాపనపత్రం అందజేశారు.