టీఆర్ఎస్ మేనిఫెస్టో – వివరాలు

గ్రేటర్ హైదరాబాద్ నేపథ్యంలో తెరాస మేనిఫెస్టోని విడుదల చేసింది. నగర ప్రజలపై సీఎం కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు. 20 వేల లీటర్ల లోపు వాడుకునే వారికి డిసెంబర్‌ నెల నుంచి ఉచితంగా తాగునీరు సరఫరా అందించనున్నట్లు ప్రకటించారు. వినియోగదారులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.

సెలూన్లు, లాండ్రీలు, దోబీఘాట్‌లకు డిసెంబర్‌ నుంచి ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. జీహెచ్‌ఎంసీలో వర్షాలకు దెబ్బతిన్న దోబీఘాట్లను పునరుద్ధరిస్తామని, లాక్‌డౌన్‌ సమయంలో మోటార్‌ వాహనాల పన్ను రద్దు చేస్తామని తెలిపారు.

Spread the love