తెరాస సీనియర్ నేత సుదర్శన్‌రావు కన్నుమూత

తెరాస వ్యవస్థాపక సభ్యుడు, పార్టీ సీనియర్ నాయకుడు ఎం సుదర్శన్‌రావు కన్నుమూశారు. ఈరోజు ఉదయం ఆయన గుండెపోటుతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సుదర్శన్ రావు మృతిపట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తెలంగాణ ఉద్యమ తొలినాళ్లలో సుదర్శన్ రావు అద్భుతంగా పనిచేశారని సీఎం గుర్తుచేసుకున్నారు. సీఎం కేసీఆర్ తో పాటుగా పలువురు తెరాస నేతలు ఉద్యమనేతకు నివాళులు అర్పించారు. ఆయన కుటుంబానికి సంతాపం, సానుభూతిని తెలిపారు.