ఈ నెల 7న తెరాస శాసనసభాపక్ష సమావేశం

ఈ నెల 7న టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. టీఆర్ఎస్ఎల్పీ సమావేశం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో జరగనుంది. దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి మృతికి టీఆర్ఎస్ఎల్పీ సంతాపం తెలపనుంది.

ఈ సమావేశంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై సీఎం కేసీఆర్ ఇప్పటికే మంత్రులు, అధికారులతో చర్చించారు.