ఓటమిని అంగీకరించిన ట్రంప్

ఎట్టకేలకు ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓటమిని అంగీకరించారు. అమెరికా కోర్టుల్లో ట్రంప్ వేస్తున్న కేసులు తిరస్కరణకు గురువుతున్న నేపథ్యంలో బైడెన్‌కు అధికార పగ్గాలు బదిలీ చేసేందుకు అంగీకరించారు. బైడెన్‌కు పాలనాధికారాలు బదిలీ చేసే ప్రక్రియను ప్రారంభించేందుకు శ్వేత శౌధం, జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

బైడెన్ గెలుపును అంగీకరించినట్టు ట్రంప్ విస్పష్ట ప్రకటన ఏదీ చేయనప్పటికీ..అధికార బదిలీ ప్రక్రియను అనుమతించిడం గమానార్హం. అయితే…తన పోరాటం ఆగదని, అంతిమ విజయం తనదేనని యథావిథిగా తనదైన శైలిలో ట్రంప్ సోమవారం వరుస ట్వీట్లు చేశారు. దీంతో బైడెన్‌ శ్వేతశౌధంలో అడుగు పెట్టడం ఇక లాంఛనమేనని తెలుస్తోంది.

Spread the love