చైనాపై ట్రంప్ సంచలన ఆరోపణలు

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చైనాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ విషయంలో చైనా వైఖరిని ట్రంప్ మొదటి నుంచి విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ ని చైనా వైరస్ గా అభివర్ణించారు ట్రంప్. అంతేకాదు.. కరోనా కేసుల విషయంలో చైనా తప్పుడు లెక్కలు చూపిందని విమర్శనలు చేశారు. తాజాగా తమ ప్రభుత్వంపై చైనా దుష్ప్రచారం చేస్తోందని ట్రంప్ దుయ్యబట్టారు.

ఈ ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి జో బిడెన్‌ను గెలిపించడానికి చైనా ప్రయత్నిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. చైనా వల్లే ప్రపంచమంతా ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఘాటుగా విమర్శించారు. చైనా వైఖరిని ఖండిస్తూ ఓ రిపోర్ట్‌ను కూడా విడుదల చేసిన వైట్ హౌజ్.. చైనా ఆర్థిక విధానాలు, సైనిక చర్యలు, మానవ హక్కుల ఉల్లంఘనలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.