తెలంగాణలో కరోనా తగ్గుముఖం

తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టినట్టు అనిపిస్తోంది. కొత్త కేసుల సంఖ్యలో తగ్గుదలతో పాటు రికవరీ అవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 1,554 కొత్త కేసులు నమోదయ్యాయ్. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ సోకిన వారి సంఖ్య 2,19,224కి చేరింది.

నిన్న ఒక్కరోజే కరోనా చికిత్స పొందుతూ 7 మంది మృతిచెందారు. దీంతో మరణించిన వారి సంఖ్య 1256కి చేరింది. కరోనా బారి నుంచి 1435 మంది కోలుకోగా.. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 19,4653కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 23,203 యాక్టివ్‌ కేసులుండగా.. 19,251 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 37,46,963 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.