తెలంగాణలో 2లక్షల కరోనా కేసులు

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 2,154 కొత్త కేసులు నమోదయ్యాయ్. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,04,748కి చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 8 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1189కి చేరింది.

కరోనా బారి నుంచి నిన్న ఒక్క రోజే 2,239 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,77,008కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 26,551 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 21,864 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక తెలంగాణలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి.. పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీనికి కారణంగా కరోనా టెస్టులు ఓ రోజు తక్కువగా చేయడం.. మరోసారి ఎక్కువగా చేయడమేనని చెబుతున్నారు.