తెలంగాణలో 2,058 కొత్త కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,058 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,60,571కి చేరింది. ఇందులో 1,29,187 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 30,400 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కరోనాతో 10 మంది మృతిచెందారు. దీంతో తెలంగాణలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 984 కి చేరింది. జీహెచ్ఎంసి 277, కరీంనగర్ 135, ఖమ్మం 103, రంగారెడ్డి 143, సిద్ధిపేట 106, వరంగల్ అర్బన్ లో 108 కేసులు నమోదయ్యాయి.