తెలంగాణలో 1,432 కొత్త కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,432 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఎనిమిది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,949 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,17,670 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,93,218 మంది డిశ్చార్జ్ అయ్యారు.

మృతుల సంఖ్య మొత్తం 1,249 కు చేరింది. ప్రస్తుతం 23,203 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. 19,084 మంది హోం క్వాంరంటైన్ లో చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజులో తెలంగాణ వ్యాప్తంగా 38,895 కరోనా పరీక్షలు చేశారు.