తెలంగాణలో 948 కొత్త కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 948 కరోనా కేసులు నమోదయ్యాయ్. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,23,059కి చేరింది. కరోనాతో నిన్న ఒక్క రోజే నలుగురు మృతి చెందగా.. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,275కి చేరింది.

రాష్ట్రంలో ప్రస్తుతం 21,091 యాక్టికవ్‌ కేసులు ఉన్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌ పేర్కొంది. వీరిలో 17,432 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి తాజాగా మరో 1,896 మంది బాధితులు కోలుకోగా..ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,00,686కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో నిన్న 212 కొత్త కేసులు నమోదయ్యాయి.