తెలంగాణలో 2273 కొత్త కేసులు

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.  గడిచిన 24 గంటల్లో 2,273 కరోనా కేసులు, 12  మరణాలు సంభవించాయి. దీంతో తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 1,61,844కు చేరుకోగా.. 956 మంది మరణించారు.

ప్రస్తుతం తెలంగాణలో 30,401 యాక్టివ్ కేసులుండగా.. చికిత్స నుంచి కోలుకుని 1,31,447 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా జీహెచ్ఎంసీ పరిధిలో 325, రంగారెడ్డి 185, మేడ్చల్‌ 164, కరీంనగర్ 122, వరంగల్‌ అర్బన్‌ 114, ఖమ్మం 97, సిద్దిపేట 91, నిజామాబాద్‌లో 91 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.