తెలంగాణ ఎంసెట్ ఫలితాలు – టాప్-10లో అబ్బాయిలే !

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వచ్చేశాయ్. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలని విడుదల చేశారు. ఎంసెట్ ఫలితాల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. అయితే టాప్ -10 ర్యాంక్స్ లో అబ్బాయిలే ఉండటం విశేషం. మొదటి ర్యాంకు – సాయితేజ

రెండో ర్యాంకు – యశ్వంత్ సాయి

మూడో ర్యాంకు – తమ్మని మణివెంకట కృష్ణ

నాలుగో ర్యాంకు – కౌశల్ కుమార్ రెడ్డి

ఐదో ర్యాంకు – రాజ్‌పాల్‌

ఆరో ర్యాంకు – నితిన్ సాయి

ఏడో ర్యాంకు – కృష్ణ కమల్‌

ఎనిమిదో ర్యాంకు – సాయివర్ధన్‌

తొమ్మిదో ర్యాంకు – సాయి పవన్ హర్షవర్దన్‌

పదో ర్యాంకు – సిద్ధార్థ్‌