తెలంగాణ ఇంటర్ అడ్మిషన్స్ డేట్ పొడగింపు

తెలంగాణ ఇంటర్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంద్. ఇంటర్ అడ్మిషన్ల తేదీని మరో సారి పొడిగించారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 16తో ఇంటర్ ప్రవేశాల గడువు ముగిసింది. అయితే తాజాగా ఈ నెల 30 వరకు అడ్మిషన్లు గడువును పొడిగిస్తూ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ అంటర్ లో అడ్మిషన్లు కల్పించాలన్న లక్ష్యంతో ఇంటర్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు, ఎయిడెడ్, ప్రభుత్వ కాలేజీలకు ఈ తేదీ పొడిగింపు నిర్ణయం వర్తించనుందని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. మరోవైపు డిసెంబర్‌ 1 నుంచి ఇంటర్ తరగతులను ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ 2020-21 విద్యా సంవత్సరాన్ని ఏప్రిల్‌ లేదా మే నెలాఖరు వరకు కొనసాగించనున్నారు.