తెలంగాణ పోలీస్.. దేశంలోనే నెం.1

సీఎం కేసీఆర్ పోలీస్ శాఖను మరింత బలోపేతం చేశారు. తెలంగాణ రాష్ట్ర పోలీసులు దేశం లోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్నారని హోమ్ శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. బుధవారం శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పరేడ్ లో మంత్రి మహమూద్ అలీ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న 450మంది కానిస్టేబుళ్ల కు మంత్రి అభినందనలు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్లు సమర్థవంతంగా విధులు నిర్వహించాలని మంత్రి మహమూద్ అలీ వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ అంజనీ కుమార్ లు పాల్గొన్నారు.