తెలంగాణ పాలిసెట్ ఫలితాలొచ్చాయ్

తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌ నాంపల్లి కార్యాలయంలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ పాలిసెట్ ర్యాంకులను విడుదల చేశారు.

సెప్టెంబర్ 2వ తేదీన జరిగిన ప్రవేశ పరీక్షకు 56, 814 మంది విద్యార్ధులు హాజరైన సంగతి తెలిసిందే. విద్యార్ధులు తమ ఫలితాలు చూసుకునేందుకు, ర్యాంక్ కార్డు కోసం https://polycetts.nic.in అఫీషియల్ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.