టీఎస్ ఎంసెట్ పరీక్ష తేదీలు ఖరారు

కరోనా లాక్‌డౌన్ తో మార్చి నెలలోనే విద్యాసంస్థలన్నీ మూతపడిన సంగతి తెలిసిందే. ఇంకా తిరిగి తెరచుకోలేదు. అయితే ప్రవేశపరీక్షలని మాత్రం నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీ అయింది. ఈనెల 9, 10, 11, 14 తేదీల్లో టీఎస్ ఎంసెట్ పరీక్షను నిర్వహించనున్నారు.

రెండు సెషన్లలో టీఎస్ ఎంసెట్ పరీక్ష ఉంటుంది. ఉదయం 9 నుంచి 12 గంటల మధ్య ఒక సెషన్ ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య రెండో సెషన్‌ను నిర్వహిస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతి ఉండదు. మరోవైపు అన్ లాక్ 5లో భాగంగా వచ్చే నెల నుంచి విద్యాసంస్థలకి కేంద్రం అనుమతి ఇవ్వనున్నట్టు సమాచారమ్.