తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో గందరగోళం

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాల్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎంసెట్‌ ర్యాంకుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయి. ఎంసెట్‌లో కటాఫ్ మార్కులు వచ్చినా.. ఇంటర్మీడియట్‌ అన్ని సబ్జెక్టుల్లో పాసైనా.. రిజల్ట్‌లో మాత్రం ఫెయిల్డ్ ఇన్ క్వాలి ఫైయింగ్ ఫలితం వస్తోంది.

ఈ ఫలితాలను చూసి విద్యార్థులు, తల్లిదండ్రులు షాక్ అవుతున్పారు. అయితే పరీక్షలకు హాజరుకాని విద్యార్థులకు సైతం ర్యాంకులు కేటాయించారు. కొన్ని పరీక్షల్లో ఫెయిల్ అయి ప్రమోటైన వారికి కూడా ర్యాంకులు కేటాయించడం విమర్శలకు దారితీస్తోంది. గత యేడాది ఇలాంటి గందరగోళ పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. అయినా.. ఈ సారి కూడా ఇంటర్ బోర్డ్ తీరు మార్చుకోలేదు.