భూముల అమ్మకంపై టీటీడీ యూటర్న్

భూములు అమ్మాలనే టీటీడీ నిర్ణయంపై పెద్ద ఎత్తున నిరసలు ఎదురవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భూముల అమ్మకంపై టీటీడీ యూటర్న్ తీసుకొనేలా కనిపిస్తోంది. ఆస్తుల అమ్మకంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకులేదని, గత బోర్డ్ (టీడీపీ హయాంలో) తీసుకున్న నిర్ణయంపై మాత్రమే బోర్డు సమావేశంలో చర్చించామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

ఆస్తుల అమ్మకం గురించి బోర్డు తరఫున ఇప్పటి వరకు ఎలాంటి తేదీని ప్రకటించలేదని, నిర్ణయం తీసుకోక ముందే రాజకీయ విమర్శలు చేయడం మంచిది కాదని అన్నారు. టీటీడీ ఆస్తులపై మరోకసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. బోర్డు నిర్ణయం మేరకు ఆస్తులను అమ్మాల్సి వస్తే పీఠాధిపతిలు, స్వామీజీల సలహాలు సూచనలు తీసుకొనే ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.