‘ట‌క్ జ‌గ‌దీష్‌’ గా నాని వచ్చేసాడు ..

నేచురల్ స్టార్ నాని ట‌క్ జ‌గ‌దీష్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ డైరెక్షన్లో ఈ చిత్రం చేయబోతున్నాడు. నాని 26వ చిత్రంగా రాబోతున్న ఈ మూవీ కి ట‌క్ జ‌గ‌దీష్ అనే టైటిల్ ఫిక్స్ చేసి పోస్ట‌ర్ విడుద‌ల చేశారు.

ఈ మూవీ కథ త‌ల్లి- కొడుకుల నేప‌థ్యంలో సాగ‌నుండ‌గా, ఇందులో నానికి ఆరుగురు సోద‌రులు ఉంటార‌ట‌. ఈ చిత్రంలో నాని ట‌క్ జ‌గ‌దీష్‌గా ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తాడ‌ని చెబుతున్నారు. రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్య రాజేష్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని షైన్‌వూస్కీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌పెద్ది నిర్మిస్తున్నారు. జనవరి లో ఈ మూవీ సెట్స్ పైకి రాబోతుంది. ప్రస్తుతం నాని వి అనే సినిమా చేస్తున్నాడు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్ట్ చేస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు.