టీవీఎస్‌ మోటార్స్ ఉద్యోగుల జీతాల్లో కోత

కరోనా ఎఫెక్ట్ తో కాస్ కటింగులు ఎక్కువయ్యాయ్. పలు కంపెనీలు భారీగా ఉద్యోగులని తొలగిస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు ఉద్యోగుల వేతనాల్లో కోత విధిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ మోటార్స్‌ తమ కంపెనీ ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాలని నిర్ణయించింది. అయితే, ఇది ఉన్నతస్థాయి ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది.

మే నుంచి అక్టోబర్‌ వరకు ఈ కోత అమలులో ఉండనున్నట్లు వెల్లడించింది. కొవిడ్‌-19 వల్ల ఏర్పడ్డ అనుకోని సంక్షోభం వల్లే ఆరు నెలల పాటు వేతనాల్లో కోత విధించాలని నిర్ణయించినట్లు కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు. కార్మికస్థాయి ఉద్యోగుల వేతనాల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ స్థాయి ఉద్యోగులకు ఐదు శాతం, యాజమాన్య స్థాయి ఉద్యోగులకు 15-20 శాతం వేతనాన్ని తగ్గించి ఇవ్వనున్నట్లు తెలిపారు.