బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బోయినపల్లి కిడ్నాప్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. బుధవారం ఉదయం నుంచి అఖిలప్రియ కస్టడీ విచారణ కొనసాగుతోంది.
బాలివుడ్ నటుడు అక్షయ్‌కుమార్ నటించిన “స్పెషల్ 26” చిత్రాన్ని అనుసరించి కిడ్నాప్ ప్లాన్ వేసినట్లు పోలీసులు గుర్తించారు. సినిమా ఫక్కీ కిడ్నాప్‌నకు అఖిలప్రియ అండ్ గ్యాంగ్ ప్లాన్ చేసినట్లు విచారణలో తేలినట్లు సమాచారం. కిడ్నాప్‌కు ముందు అక్షయ్‌కుమార్ సినిమా గురించి చంద్రహాస్‌తో అఖిలప్రియ చెప్పినట్లు వినికిడి. అఖిలప్రియ ఆదేశాలతోనే అక్షయ్‌కుమార్ సినిమాను కిడ్నాప్ గ్యాంగ్‌కు అఖిలప్రియ భర్త భార్గవ్‌రావ్, చంద్రహాస్ చూపించినట్లు తెలుస్తోంది.
Spread the love