ఆ రెండూ ఉంటేనే ఫ్రీ వాటర్.. !

గ్రేటర్ ఎన్నికల్లో తెరాస ఫ్రీ వాటర్ అందిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పథకాన్ని జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ పరిధిలోని రహమత్‌ నగర్‌లో మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా గ్రేటర్‌ పరిధిలో ఒక్కో కుటుంబానికి నెలకు 20వేల లీటర్ల వరకు ఉచితంగా తాగునీటిని అందించనున్నారు. అయితే ఈ ఫ్రీ వాటర్ పథకం పొందాలంటే రెండు కండిషన్స్ ఉన్నాయ్.

అందులో మొదటిది వాటర్ కనెక్షన్ కు మీటర్ తప్పనిసరిగా ఉండాలి. రెండవది.. మీ CAN నంబరును ఆధార్ తో లింక్ చేసుకోవాలి. ఈ మేరకు వాటర్ బోర్డు స్పష్టం చేసింది. మార్చి 31లోగా ఆధార్ లింకేజీ, మీటర్ లేనివారు అప్లై చేసుకోవాలని తెలిపింది. అలా చేసుకున్న వారికే ఈ స్కీమ్ వర్తించనుందని స్పష్టం చేసింది. ఇప్పటికే ఆధార్ లింకేజ్, మీటర్ ఉన్న వారు డిసెంబర్ నెలకు సంబంధించిన బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని వాటర్ బోర్డు తెలిపింది.

Spread the love