ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. రూ. 25కే కిలో ఉల్లి !

దేశంలో ఉల్లి ధరలు భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. సామాన్యులకు అందనంత దూరంలో ఉన్నాయి. ఏకంగా రూ. 100 కిలో పలుకుతుంది. ఈ నేపథ్యంలోఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీపై అందిస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సబ్సిడీ కింద కేవలం 25 రూపాయలకు ఉల్లిని అందించాలనే నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలోని అన్ని రైతు బజార్లలో ఉల్లిని 25 రూపాయల సబ్సిడీ కింద అందజేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. పలు ప్రాంతాల నుంచి ఉల్లిని దిగుమతి చేసుకొని రాష్ట్ర ప్రజలకు అందించాలని నిర్ణయించారు . రాష్ట్రంలోని రైతు బజార్లు అన్నింట్లో 25 రూపాయలకు ఉల్లిని అందుబాటులో ఉంచేందుకు నిర్ణయించింది. ఐతే, ఒక్కో వినియోగదారులకు ఒక కిలో ఉల్లి మాత్రమే ఇచ్చేందుకు నిర్ణయించారు.