జగన్ పాలనపై ఉండవల్లి అసంతృప్తి

మాజీ ఎంపీ ఉండవల్లి ప్రస్తుతం ఏ పార్టీలో లేరు. కానీ ఆయన ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇస్తుంటారు. ప్రభుత్వం పనితీరుప రిపోర్ట్స్ ఇస్తుంటారు. ఆయన రిపోర్ట్ లకి ప్రభుత్వాలు,ప్రతిపక్షాలు ప్రాధాన్యత ఇస్తుంటాయ్. ఎందుకు అంటే.. ? ఆయన విశ్లేషణ బాగుంటుందని చెబుతున్నారు. తాజాగా ఉండవలి సీఎం జగన్ యేడాది పాలన పై ప్రొగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు. జగన్ పాలనపై పెదవి విరిచారు.

కరోనా వ్యాప్తి నివారణలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన విమర్శించారు. ధర పెంచితే మద్యం తాగేవారు తగ్గుతారు అనుకోవడం భ్రమ అని వ్యాఖ్యానించారు. నిమ్మగడ్డ రమేశ్‌పై సీఎం జగన్‌ ఎందుకు అభద్రతాభావంతో ఉన్నారని ప్రశ్నించారు. ప్రెస్‌మీట్‌ పెట్టి నిమ్మగడ్డ రమేశ్‌పై మాట్లాడటం ఘోరమైన చర్య అని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. ఏం చేసినా ఊరుకోవడానికి అక్కడుంది ఎల్వీ సుబ్రహ్మణ్యం కాదు… అక్కడుంది నిమ్మగడ్డ రమేశ్‌, ఏబీ వెంకటేశ్వరరావు అని ఉండవల్లి పేర్కొన్నారు. ప్రజలకు రూ.80,500 కోట్లు పంచుతామని ప్రభుత్వం అంటోందన్న ఉండవల్లి… అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు.