యూపీ పంచాయితీ ఎన్నికలు : ఓటరు జాబితాలో మోడీ, సోనమ్, లాడెన్

ఉత్తర ప్రదేశ్‌ పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో ఓ గ్రామంలోని ఓటరు జాబితాను తనిఖీ చేసిన అధికారులకు షాక్ తగిలింది. ఓటరు లిస్టు జాబితాలో ”నరేంద్ర మోదీ”, ”సోనమ్ కపూర్”, ”బరాక్ ” పేర్లతో పాటు చివరికి ”లాడెన్” వంటి పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ”మాయ”, ”అనిల్ కపూర్”, ”శివరాజ్” తదితర పేర్లు కూడా ఉన్నాయి.

”లాడెన్” తండ్రి పేరు ”మోదీ” అనీ.. ”పంకా” అనే ఓటరు ”చెక్” అనే వ్యక్తి కుమారుడని నమోదు చేశారు. ప్రముఖుల పేర్లుతో, ఏమాత్రం పొంతన లేకుండా జాబితా కనిపించడంతో అనుమానం వచ్చి తనిఖీ చేశామనీ.. దీంతో తమ అనుమానాలే నిజమయ్యాయని స్థానిక అధికారి, బీఎల్‌వో ప్రమీలా దేవి పేర్కొన్నారు. ఈ నెలాఖరు కల్లా మళ్లీ సవరించిన జాబితాను విడుదల చేస్తామని ఆమె తెలిపారు.