ఉప్పెన ఖాతాలో 21యేళ్ల రికార్డ్


బుచ్చిబాబు దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్-కృతీ శెట్టి జంటగా నటించిన చిత్రం ‘ఉప్పెన’. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంతేకాదు.. ఉప్పెన 21యేళ్ల చరిత్రని తిరగాసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. టాలీవుడ్ లో ఇప్పటి వరకు అత్యధికంగా గ్రాస్ వసూలు చేసిన సినిమాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘చిరుత’నే నిలిచింది. ఆ సినిమా రికార్డ్సు అన్ని 12 ఏళ్లుగా అలానే ఉన్నాయి.

అయితే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోనే తుడిపేశాడు. ‘చిరుత’ తన లైఫ్ టైమ్ రన్‌లో వసూలు చేసిన మొత్తాన్ని పంజా వైష్ణవ్ తేజ్ తొలి చిత్రం ‘ఉప్పెన’ తొలి వారంలోనే దాటేసింది. ‘ఉప్పెన’ తొలిరోజు వసూళ్లు చూసినప్పుడే తొలి వారం ముగిసే సరికి ‘చిరుత’ రికార్డును తిరగరాస్తుందని అందరూ భావించారు. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన ‘ఉప్పెన’ కేవలం 3రోజుల్లోనే టాలీవుడ్‌లో భారీ గ్రాస్ రాబట్టిన డెబ్యూ హీరో చిత్రంగా నిలిచింది. అంతే కాదు భారత సినీ చరిత్రలో 21 ఏళ్లు పదిలంగా ఉన్న రికార్డ్స్ ‘ఉప్పెన’ బద్దలుకొట్టింది. హృతిక్ రోషన్ తొలి చిత్రం ‘కహో నా ప్యార్ హై’ పేరిట ఉన్న రికార్డులను ‘ఉప్పెన’ బద్దలుకొట్టింది.

Spread the love