తండ్రైన ఉసేన్ బోల్ట్

జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ తండ్రయ్యాడు. బోల్ట్ భాగస్వామి..కాసీ బెన్నెట్ కింగ్ స్టన్ లోని ఓ ఆసుపత్రిలో పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని జమైకా ప్రధాన మంత్రి ఆండ్రూ హోల్నెస్ తెలిపాడు. ‘ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఉసేన్ బోల్ట్ – కాసి బెన్నెట్ జంటకు శుభాకాంక్షలు’ అని ఆయన ట్విట్ చేశారు.

ఇక 100మీ పరుగులో దశాబ్దకాలం పాటు ఉసేన్ బోల్ట్ తిరుగులేని రికార్డ్‌లు నెలకొల్పాడు. దాదాపుగా అన్ని ఈవెంట్లలో బంగారు పథకాలను సాధించాడు. చిట్ట చివరి పరుగును కాంస్యంతో ముగించాడు. 2017లో బోల్ట్ రిటైర్ అయ్యాడు. 100 మీటర్లు, 200 మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.