కేటీఆర్’పై ఉత్తమ్ ప్రశంసలు

నిత్యం తెరాస ప్రభుత్వంపై విమర్శలు చేసే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి కేటీఆర్ పై ప్రశంసలు కురిపించడం హాట్ టాపిక్ గా మారింది. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం కోసం మంత్రి కేటీఆర్ సూర్యాపేట, హుజూర్‌నగర్, నల్లగొండలో పర్యటించారు.

ఈ సందర్భంగా హుజూర్‌నగర్‌లో సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సభలోనే మంత్రి కేటీఆర్‌పై ఉత్తమ్ ప్రశంసల జల్లు కురిపించారు. కేటీఆర్ డైనమిక్ మినిస్టర్ అంటూ కితాబిచ్చారు. ఉత్తమ్ వ్యాఖ్యలతో సభ చప్పట్లో మారుమ్రోగిపోయింది.