ఉత్తరాఖండ్‌ ఘటన : గల్లంతైన 136 మంది మృతి


ఉత్తరాఖండ్‌ వరదల్లో 136 మంది గల్లంతైన సంగతి తెలిసిందే. వారిని రక్షించేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. గల్లంతైన 136 మంది మృతి చెందినట్టు తాజాగా ప్రభుత్వం ప్రకటించింది.

మంచు చరియలు విరిగపడటంతో అలకనందా నదిని వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఈ వరదల్లో రిషిగంగా ప్రాజెక్టు సమీపంలో పనిచేస్తున్న పలువురు కార్మికులు గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో ఒక జలవిద్యుత్‌ కేంద్రం, ఐదు వంతెనలు కొట్టుకుపోయాయి. మరో విద్యుత్‌ ప్రాజెక్టు తీవ్రంగా దెబ్బతింది. రాష్ట్ర, జాతీయ విపత్తు ప్రతిస్పందన బృందాలు, సాయుధ దళాలు, పారా మిలటరీ సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటివరకు 68 మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు ప్రకటించారు.

Spread the love