తాట తీయాల్సిందే అంటున్న వర్మ..ఎందుకంటే

సంచలన దర్శకులు రామ్ గోపాల్ వర్మ నిత్యం ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా వైరల్ అవుతుండడం తో జనాల్లో అవగాహనా తీసుకొస్తున్నాడు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మోడీ లాక్ డౌన్ ప్రకటించారు. అయినప్పటికీ కొంతమంది దానిని పట్టించుకోకుండా రోడ్ల పైకి వస్తున్నారు. దీంతో పోలీస్ శాఖా సీరియస్ గా తీసుకొని రోడ్ల ఫై కనిపిస్తే వారి లాఠీకి పనిచెపుతున్నారు.

దీనినే వర్మ తనదైన స్టయిల్ లో ట్విట్టర్ లో తెలిపాడు. ప్రభుత్వం మన కోసం ఇంత చేస్తున్నా కూడా కొందరు మాత్రం ఇంకా ఆకతాయితనంగా రోడ్లపైకి వచ్చేస్తున్నారని.. బాధ్యతారాహిత్యంగా అలా చేయడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నాడు. ఈ జనానికి ఇలా చెబితే అర్థం కాదు.. ఆర్మీని దించితే కానీ బుద్ధి రాదు అంటూ ఫైర్ అయ్యాడు. జనతా కర్ఫ్యూ సమయంలో కనిపించిన నిబద్దత ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదంటూ ప్రశ్నించాడు. మనకు మనమే బాధ్యత తీసుకుంటే కదా కరోనా కంట్రోల్ అవుతుంది.. నిన్ను నువ్వు సీరియస్‌గా తీసుకోకపోతే ఎలా అంటున్నాడు. అలాగే మన రాజకీయ నాయకులు కూడా బుద్దిగా ఇంట్లో ఉండకుంటే ఆర్మీ చేతిలో చావు దెబ్బలు తినక తప్పదు అంటూ హెచ్చరించాలంటూ ప్రభుత్వాలకు సూచించాడు ఈ దర్శకుడు. ప్రజలు తమకు తాముగా ఇంట్లో కానీ ఉండకపోతే జరిగే నష్టం ఊహకు కూడా అందదంటున్నాడు ఈయన. జనాలు ఇప్పటికైనా కరోనా మహమ్మారి తీవ్రతను అర్థం చేసుకుని ఇంట్లోనే ఉండిపోవాలని విజ్ఞప్తి చేసాడు వర్మ.