వెంకీమామ.. ముందుకు వచ్చాడు


వెంకటేష్‌, నాగచైతన్య కలసి నటిస్తున్న చిత్రం ‘వెంకీమామ’. పాయల్‌ రాజ్‌పుత్‌, రాశీ ఖన్నా కథానాయికలు. బాబి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి బరిలోకి దింపాలని భావించారు. అయితే పోటీ ఎక్కువగా ఉండటంతో, డిసెంబర్ 13వ తేదీనగానీ .. 20వ తేదీనగాని విడుదల చేయాలనుకుంటున్నట్టుగా వార్తలు వచ్చాయి.

అయితే వెంకటేశ్‌ జన్మదిన కానుకగా ఈ నెల 13న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాలో వెంకటేశ్‌ సరసన పాయల్‌ రాజ్‌పుత్‌ నటిస్తోంది. నాగచైతన్య పక్కన రాశీ ఖన్నా కనిపించనుంది. తమన్‌ మ్యూజిక్. సురేష్‌బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌ నిర్మాతలు. ఈ సినిమాలో నాగచైతన్య సైనికుడి పాత్రలోను, వెంకటేశ్‌ రైతుగాను కనిపిస్తాడు. సినిమాని సురేశ్‌ప్రొడక్షన్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్నాయి.