పాత గాయాలని గుర్తు చేసుకున్న వీహెచ్

23 మంది కాంగ్రెస్ సీనియర్లు సోనియా గాంధీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇంకా చర్చ కొనసాగుతోంది. సోనియా, రాహుల్ గాంధీలకు సపోర్ట్ గా కాంగ్రెస్ ముఖ్యనేతలు నోళ్లు తెరస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ అజాద్ పై టీ కాంగ్రెస్ నేత వీహెచ్ ఫైర్ అయ్యారు.

“జనార్దన్ రెడ్డి తరువాత కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న నన్ను నువ్వు దెబ్బ కొట్టింది వాస్తవం కాదా ఆజాద్. ఇందిరాగాంధీ లేనిది నువ్వు ఎక్కడ నుంచి వచ్చావు ఆజాద్. 40 ఏళ్ళల్లో కాంగ్రెస్ దయ వల్ల ఒక్కరోజు కూడా పదవి లేకుండా లేవు. కాంగ్రెస్ పార్టీలో అనేక ఉన్నత పదవులు అనుభవించిన ఆజాద్ ఇవాళ అదే కాంగ్రెస్ కష్ట పరిస్థితుల్లో ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడటం విడ్డూరం.

సాధారణ స్థాయి నుంచి జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి వరకు కాంగ్రెస్ నీకు అండగా ఉంది. ఫ్లోర్ లీడర్ ఉన్న నువు ఎలా లెటర్ రాస్తావ్. ఇందిరమ్మ దయవల్ల నీకు పదవులు వచ్చాయి. ఇందిరమ్మ తరువాత సోనియాగాంధీ , శరద్ పవార్‌లు ఆజాద్‌కు రాజకీయంగా అండగా ఉన్నారు” అని వీహెచ్ తెలిపారు.