నాగబాబుపై వీహెచ్ ఫైర్

మహత్మా గాంధీని చంపిన గాడ్సే గొప్ప దేశభక్తుడు అని చెప్పిన ఓ వీడియోని మెగా బ్రదర్ నాగబాబు షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఊహించినట్టుగానే ఇది వివాదాస్పదం అయింది. నాగ బాబు చేసిన పనికి కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఫైర్ అయ్యారు. చిరంజీవి గాంధీ గిరి మీద సినిమా తీస్తే.. నాగాబు ఆరెస్సెస్ ట్రాప్‌లో పడ్డాడని వీహెచ్ ఆరోపించారు వీహెచ్.

నాగబాబు ఎందుకు అలా మాట్లాడాడో తెలియదన్న ఆయన తమ్ముడు పవన్ కమ్యూనిస్టు గురించి సినిమా చేశాడని అన్నారు. ఓకే కుటుంబములో ఎన్ని ట్విస్టులో అని వీహెచ్ పేర్కొన్నారు. మరో కాంగ్రెస్ నేత విజయశాంతి కూడా నాగబాబుపై ఫైర్ అయ్యారు. గాడ్సే బతికు ఉంటే.. తనకు కూడా మంచి బుద్ది ప్రసాదించాలని కోరుకుని ఉండేవాడని రాములమ్మ ట్వీట్ చేశారు.