ఓటు హక్కుపై విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు

లిక్కర్ కోసం ఓటును అమ్ముకునే వాళ్లకు ఓటు హక్కు ఉండకూడదని సంచలన కామెంట్ చేసాడు విజయ్ దేవరకొండ. ప్రముఖ ఫిలిం క్రిటిక్స్ భరద్వాజ్ రంగన్ అనుపమ చోప్రాలతో చిట్ చాట్ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ .. డబ్బుల కోసం మందు కోసం ఓటును అమ్ముకునే తన ఓటు విలువేంటో తెలియని వాళ్లకు ఓటు హక్కు ఎందుకని విజయ్ అభిప్రాయపడ్డాడు.

పెళ్లి చూపులు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్.. అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. క్రేజీ హీరోగా మారాడు. గీతా గోవిందం, నోటా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫెమస్ లవర్ సినిమాలతో ఆకట్టుకున్నారు. ఆయన తాజా చిత్రం ఫైటర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. పూరి,విజయ్ లకి ఇది తొలి పాన్ ఇండియా సినిమా.