రేపు బీజేపీలో చేరనున్నవిజయశాంతి

కాంగ్రెస్ మహిళా నాయకురాలు విజయశాంతి బీజేపీలో చేరడం ఖాయమైంది. ఇందుకు ముహూర్తం కూడా కుదిరింది. రేపే రాములమ్మ కమలం తీర్థం పుచ్చుకోనుంది. ఇందుకోసం ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేడీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు.

అనంతరం ఢిల్లీలో పలువురు పార్టీ, కేంద్ర పెద్దలతో భేటీ కానున్నారు. ఈ మేరకు బీజేపీ వర్గాల ద్వారా సోమవారం సమచారం అందింది. అంతేకాకుండా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తరుఫున విజయశాంతి ప్రచారం చేయనున్నారు. బీజేపీ ద్వారానే ఆమె రాజకీయాల్లో అడుగుపెట్టారు. దాదాపు 20 యేళ్ల తర్వాత తిరిగి సొంత గూటికి చేరనున్నారు.

Spread the love