బాబు కుట్రలపై విజయసాయి ఫైర్


తెదేపా అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఫైర్ అయ్యారు. పొదుపు సంఘాల మహిళల అప్పులను నాలుగు దశల్లో తీర్చే వైఎస్సార్‌ ఆసరా పథకాన్ని శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన విజయసాయి బాబుపై ఫైర్ అయ్యారు. చంద్రం..మళ్ళీ దళిత రాజకీయం మొదలుపెట్టావా? సీఎం జగన్ గారు శ్రీకారం చుట్టిన ”‘వైఎస్సార్‌ ఆసర’ నుండి ప్రజల దృష్టి మరల్చడమే మీ కుతంత్రం కదా? కానీ మీ కుట్ర విఫలం.‘వైఎస్సార్‌ ఆసర’ సఫలం. మళ్ళీ వినండి..మాట నిలబెట్టుకొని తొలి విడతలో రూ.6,792 కోట్లు అక్కచెల్లమ్మల ఖాతాలో జగన్ గారు జమ చేశారు’ అని అన్నారు.