యూ టర్న్ అంకుల్.. వారెమన్నారో చెప్పండి ?

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖ ఘటన బాధితులని పరామర్శించేందుకు వస్తున్న వేళ.. ఆయనపై సటైర్స్ వేశారు ఎంపీ విజయసాయి రెడ్డి. యూటర్న్ అంకుల్ అంటూ.. తనదైన శైలిలో ట్విట్లు చేశారు.

“యూ టర్న్ అంకుల్.. విశాఖకు పర్మిషన్ కేంద్రాన్ని అడిగారు కదా.. వారేమన్నారో చెప్పండి.. మీబోటి అంతర్జాతీయ నాయకులు అంతలోనే యూ టర్న్ తీసుకుని మా రాష్ట్ర డీజీపీని పర్మిషన్ అడగటం ఏమిటి చెప్పండి?’ అంటూ విజయసాయిరెడ్టి ట్వీట్‌ చేశారు.

‘చిత్తుగా ఓడాక ఫ్రస్ట్రేషన్ పెరిగి మెంటల్ కండిషన్ సీరియస్ అయి ఉండొచ్చుకాని రెండు మూడేళ్ల క్రితమే పిచ్చి ముదిరింది. అప్పటి మాటలు అలాగే ఉన్నాయి. బావుల అనుసంధానం చేస్తానని అంటే, ఎల్లో మీడియా ‘విజనరీ’ వాక్కులకు ఒక రేంజిలో ఎలివేషన్ ఇచ్చి అచ్చేసింది’ అంటూ మరో ట్వీట్‌ చేశారు.

‘సిఎం జగన్ గారు తీసుకున్న ప్రత్యేక చర్యలు, వైద్య సిబ్బంది అత్యుత్తమ చికిత్స అందించడం వల్ల రాష్ట్రంలో రికవరీ రేటు 68 శాతంగా రికార్డయింది. ప్రాణాంతక వైరస్ పై ఇది అసాధారణ విజయం’ అంటూ వరుస ట్విట్లు చేశారు విజయసాయి.