విజయవాడ కనకదుర్గ ఆలయం రథం ఘనపై భాజాపా స్పందన

అంతర్వేది ఆలయ రథం ఘటన మరవకముందే.. విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి వెండి రథానికి ముందు, వెనుక భాగాన అమర్చిన నాలుగు సింహాల ప్రతిమల్లో మూడు అదృశ్యమయ్యాయన్న విషయం బయటకురావడం చర్చనీయాంశమైంది.

ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ఏపీ భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు పలువురు భాజపా నేతలు దుర్గమ్మ ఆలయాన్ని సందర్శించారు. దుర్గగుడి ఈవో సురేశ్‌బాబుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు.

రథానికి ఉండాల్సిన నాలుగు సింహాల్లో ఒక సింహం ప్రతిమ మాత్రమే ఉండటాన్ని గమనించాం. ఉన్న ఒక సింహం ప్రతిమ కాళ్ల వద్ద కూడా పగుళ్లు ఉన్నాయి. నాలుగు సింహాల ప్రతిమలు ఉంటే రథానికే ఉండాలి, లేకపోతే నాలుగూ లాకరులో ఉండాలి. కానీ ఒక్కటి మాత్రమే రథానికి ఉన్నది. ఆలయ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందన్నారు.