ఏపీలో ఆగని విగ్రహాల ధ్వంసం

ఏపీలో విగ్రహాల ధ్వంసం కొనసాగుతూనే ఉంది.విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముడి విగ్రహాం శిరచ్చేదం ఘటన మరువకముందే.. ఈ సారి సీతమ్మ విగ్రహాంపై దాడి జరిగింది. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌కు సమీపంలో ఉన్న సీతారామమందిరంలో సీతమ్మ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేయనున్నారు.

మరోవైపు రామతీర్థంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలు పార్టీలకు చెందిన నాయకులు రామతీర్థంలో పర్యటిస్తున్నారు. దీంతో అక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రామతీర్థం ఘటన..రాజకీయ రంగు పులుముకోవడంతో.. అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీ నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.

Spread the love