బ్రేకింగ్ : గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే అరెస్ట్


నిన్న తృటిలో తప్పించుకున్న గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఈరోజు చిక్కాడు. మధ్యప్రదేశ్ ఉజ్జయిన్‌లోని ఓ గుడివద్ద ఈ ఉదయం అరెస్టు చేశారు. ఉజ్జయిన్‌లోని ఓ ఆలయంలో మాస్కుతో తిరుగుతున్న వికాస్ దూబేను అక్కడే ఉన్న ఓ వ్యక్తి గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశాడు.

అప్పటికే అనుమానం వచ్చిన ఆలయ సెక్యూరిటీ విచారించగా తప్పుడు ఐడీ కార్డు చూపించడంతోపాటు వారితో వాగ్వాదానికి దిగాడు. ఆ సమయంలో పోలీసులు అక్కడికి చేరుకొని అతన్ని అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. కాన్పూర్ 8మంది పోలీసులను కాల్చివేసిన ఘటనలో వికాస్ దూబె ప్రధాననిందితుడు. ఆయన ప్రధాన అనుచరుడు అమర్ దూబె ని పోలీసులు వేసేశారు.

Spread the love