గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌

గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఎన్‌కౌంటర్ చేశారు యూపీ పోలీసులు. ‌సినీ ఫక్కీలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్ ఆసక్తిగా సాగింది. ఈ ఉదయం వికాస్ దూబే కాన్ఫూర్ కి తరలిస్తుండగా.. ఆయన పోలీసుల తుపాకిని లాక్కొని కాల్పులు జరిపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కాన్వాయ్ లోని వాహనం బోల్తాపడింది ఆ సమయంలో పారిపోవడానికి ప్రయత్నించిన వికాస్ దూబేని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు.

ఈ ఘటనలో అతని ఛాతిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. వెంటనే ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేయగా అప్పటికే మరణించాడు. ఓ వైపు జోరున వర్షం, మరోవైపు సొంత ప్రాంతం కావడంతో పారిపోవడం సులువని ఈ విధంగా చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

Spread the love