యుఎస్ లో విమాన ప్రమాదం.. 4గురు మృతి !

అమెరికాలో విషాదం నెలకొంది. విమాన ప్రమాదంలో ఓ శాసనసభ్యుడు సహా మొత్తం ఏడుగురు మరణించారు. రెండు విమానాలు ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అమెరికాలోని అలస్కాలో రెండు చిన్న విమానాలు ఢీకొన్నాయి. ఒక విమానంలో ఒక్కరే ఉండగా మరో విమానంలో ఆరుగురు ప్రయాణిస్తున్నట్లు స్థానిక మీడియా తెలిపింది.

ప్రమాదంలో గాయపడినవారిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మొత్తం ఆరుగురు మరణించారని ప్రజా సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటించినట్లు వెల్లడించాయి. మృతుల్లో శాసనసభ్యుడు గ్యారీ క్నాప్ సైతం ఉన్నట్లు తెలుస్తోంది. అలస్కా ప్రతినిధుల సభలో గ్యారీ క్నాప్ సభ్యుడిగా ఉన్నారు.