ఆర్ఆర్ఆర్ టైటిల్ ఫై వినాయక్ స్పందన ..

దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ , రామ్ చరణ్ హీరోలుగా నటిస్తుండగా ..బాలీవుడ్ భామ అలియా , అజయ్ దేవగన్ తో పాటు హాలీవుడ్ ప్రముఖ నటి నటులు నటిస్తుండడం తో వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ఫై ఆసక్తి నెలకొని ఉంది. తాజాగా ఈ మూవీ తాలూకా ఫస్ట్ లుక్ ఉగాది కానుకగా విడుదల చేసి ఆకట్టుకున్నారు.

ఈ సినిమాకు రౌద్రం-ర‌ణం-రుధిరం అనే టైటిల్‌ను ఖ‌రారును చేయ‌డంతో పాటు మోష‌న్‌పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ ఫస్ట్ లుక్ ఫై సినీ ప్రముఖులంతా తమ స్పందనను తెలియజేస్తున్నారు. డైరెక్టర్ వినాయక్ తనదైన రీతిలో స్పందించారు.

బ్రిటిష్ ప్రభుత్వ పాలన పై కట్టలు తెంచుకున్న “రౌద్రం” (కోపం)… ! ఆ ఇద్దరు కలిసి చేయాలనుకున్న “రణం” (యుద్ధం), ఆ యుద్ధం లో వాళర్పించిన “రుధిరం” (రక్తం) అని ట్వీట్ చేశారు. రామ్ గోపాల్ వ‌ర్మ‌, అఖిల్‌, అలియా భ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు ఆర్ఆర్ఆర్ మోష‌న్ పోస్ట‌ర్‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.