అనుష్క వెబ్ సిరీస్ పై విరాట్ ప్రశంసలు

కరోనా లాక్‌డౌన్ తో షూటింగ్స్, థియేటర్స్ మూతపడ్డాయి. దీంతో సినీ తారలు ఇంటికే పరిమితం అయ్యారు. అయితే లాక్‌డౌన్ ఎఫెక్ట్ తో డిజిటల్ మీడియాకు డిమాండ్ పెరిగింది. వెబ్ సీరీస్ లు క్యూ కట్టబోతున్నాయి. సినిమాలు ఓటీటీలో రీలీజ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బడా నిర్మాతలు, బడా సంస్థలు వెబ్ సిరీస్ ల వైపు చూస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటి, విరాట్ కోహ్లీ సతీమణి నిర్మాతగా వ్యవహరించిన ‘పాతాల్ లోక్’ అనే వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది.

ఈ సిరీస్‌పై విరాట్ ప్రశంసల వర్షం కురిపించాడు. ‘పాతాల్‌ లోక్’ ఒక మాస్టర్ పీస్ అని అతను అన్నాడు. ”పాతాల్‌లోక్ వెబ్ సిరీస్‌ని చూశాను. స్క్రీన్‌ప్లే, కథ విషయంలో ఇది ఒక మాస్టర్‌ పీస్, అంతేకాక.. అందరూ అద్భుతంగా నటించారు. ప్రజలు కూడా ఈ సిరీస్‌ను ఇంతలా ఎందుకు ఆదరించారో నాకు అర్ధమైంది. ఇలాంటి అద్భుతమైన వెబ్‌సిరీస్‌లను నిర్మిస్తున్న నా ప్రేమ అనుష్క శర్మని చూసి చాలా గర్వపడుతున్నాను”నని విరాట్ రాసుకొచ్చారు.