విరాట్ పాప పిక్.. వైరల్ !

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తండ్రైన సంగతి తెలిసిందే. సోమవారం అనుష్క శర్మ పండింటి ఆడబిడ్దకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన కోహ్లీ.. అనుష్క, బేబి ఇద్దరు బావున్నారని తెలిపారు. ఈ సమయంలో దయచేసి ప్రైవసీకి ఎవ్వరూ భంగం కలిగించొద్దని అభిమానులను కోరారు.

తాజాగా విరుష్క కుమార్తె ఫొటో ఇదేనంటూ ఓ ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. ఆ ఫొటోలో అనుష్క శర్మ చేతిలో బేబి ఉన్నట్లుగా ఉంది. దీంతో విరుష్క పాప అంటూ చాలా మంది అభిమానులు షేర్లు చేయడం ప్రారంభించారు. అయితే అసలు విషయం ఏంటంటే.. అక్కడ విరుష్క తనయ ఫొటో కాదట. సాధారణంగా గూగుల్‌లో దొరికే కొన్ని ఫొటోలను పొటోషాప్ చేసిన కొందరు అందులో అనుష్క ఫొటోను పెట్టారు.

Spread the love