విరుష్క చిరు విన్నపం.. ఏంటంటే ?

బాలీవుడ్‌ స్టార్‌ అనుష్క శర్మ, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి జంటకు సోమవారం ఆడబిడ్డ జన్మించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ దంపతులు తమకు ప్రైవసీ కావాలంటూ.. ఓ లేఖని విడుదల చేసింది.

‘మీరు మాపై చూపిస్తున్న ప్రేమ, ఆదరాభిమానాలకు ధన్యవాదాలు. మా జీవితంలోని సంతోషకర సమయాన్ని మీతో కలిసి ఆస్వాదించాలని భావిస్తున్నాం. అయితే తల్లిదండ్రులుగా మీకు మాదో చిన్న విన్నపం. మా పాపాయి గోప్యతకు భంగం కలగకుండా తనను సంరక్షించుకోవాలని భావిస్తున్నాం. అందుకు మీ సహాయ సహకారాలు కావాలి’’ అని విరుష్క దంపతులు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

Spread the love