విశాఖ హిందూస్థాన్‌ షిప్‌యార్డు ఘటనలో 11కి చేరిన మృతుల సంఖ్య

విశాఖలోని హిందూస్థాన్‌ షిప్‌యార్డులో ఘోర ప్రమాదం జరిగింది. షిప్‌ యార్డులో భారీ క్రేన్‌ సామర్థ్యం పరీక్షిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 11 మంది మృతి చెందారు. హుద్‌హుద్‌ తుపాను సమయంలో పూర్తిగా ధ్వంసమైన పాత భారీ క్రేన్‌ స్థానంలో ఇటీవలే రూ.12 కోట్లతో కొత్త క్రేన్‌ను షిప్‌ యార్డు యాజమాన్యం కొనుగోలు చేసింది. నిర్వహణ బాధ్యతలను పొరుగు సేవలకు అప్పగించింది.

ఈ ఘటన్లో  మృతుల్లో ప్రసాద్‌, జగన్‌ శాశ్వత ఉద్యోగులు కాగా.. మిగిలిన వారు పొరుగుసేవల కార్మికులు. ప్రమాద సమయంలో క్రేన్‌ కేబిన్‌లో 15 మంది ఉన్నట్లు అక్కడి సిబ్బంది పేర్కొన్నారు. ఈ  ఘటనపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆరా తీశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు. ఘటనపై తక్షణం చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా కలెక్టర్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ను సీఎం జగన్‌ ఆదేశించారు.