పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన విశాల్

కోలీవుడ్ హీరో విశాల్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం కొన్నాళ్లుగా జోరుగా జరుగుతోంది. తాజాగా ఈ ప్రచారంపై విశాల్‌ మేనేజర్‌ హరికృష్ణన్ స్పందించారు.

విశాల్‌ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం లేదని, కాబట్టి ఎవరూ ఆ వార్తలను నమ్మవద్దని సూచించారు. హరికృష్ణన్ పెట్టిన ట్వీట్‌తో విశాల్‌ ఇప్పట్లో రాజకీయాల్లోకి రావడం లేదని అభిమానులకు స్పష్టత వచ్చింది. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన కంగన ధైర్యాన్ని ప్రశంసిస్తూ విశాల్‌ ఓ ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే.